దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగించాలి అని ప్రజలు కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అభిప్రాయ సేకరణ జరుగుతుంది. కరోనా రోజు రోజుకి తన విశ్వరూపం చూపించడం తో అందరూ కూడా ఇప్పుడు లాక్ డౌన్ కావాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్ డౌన్ ఉండటమే మంచిది అనే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ విధించే సమయమ్లో వెయ్యి కేసుల వరకు ఉండేవి.
కాని ఇప్పుడు 31 వేలు ఉన్నాయి. అంటే దాదాపు 30 వేల కేసులు లాక్ డౌన్ విధించిన తర్వాత దేశంలో పెరిగాయి. దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ ని ఎత్తివేస్తే ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తారని ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఫలితం ఉండదు అని కాబట్టి లాక్ డౌన్ ని కొనసాగించడమే మంచిది అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ ప్రజలు లాక్ డౌన్ ని కావాలి అంటున్నారు.
లాక్ డౌన్ ని తెలంగాణా ప్రజలు కూడా కోరుతున్నారు. సోషల్ మీడియాలో లాక్ డౌన్ కావాలా వద్దా అని అడగగా అందరూ కూడా లాక్ డౌన్ ఉంటేనే మంచిది అంటున్నారు. పోల్స్ అన్నీ కూడా లాక్ డౌన్ ని కావాలి అని చెప్తున్నాయి. మరి దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. రెండు మూడు రోజుల్లో లాక్ డౌన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.