కేఏ పాల్ తనని తాను ప్రపంచ శాంతి దూతగా చెప్పుకుంటాడు. అటువంటి కేఏ పాల్ గత సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను స్థాపించిన ప్రజా శాంతి పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. సీరియస్ గా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు క్యాంపెయిన్ చేస్తున్న టైంలో కేఏ పాల్ వ్యవహరించిన తీరు అందరికీ నవ్వులు తెప్పించాయి. దాదాపు వంద సీట్లు గెలుస్తామని అప్పట్లో కేఏ పాల్ అనటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తనతో కలిసి పని చేస్తే చాలా ఈజీగా ఏపీలో ప్రభుత్వం స్థాపించ వచ్చని జనసేన కి ఆఫర్ ఇవ్వటం కూడా జరిగింది.తీరా ఫలితాలు వచ్చాక నోటా కి వచ్చిన ఓట్లు కూడా ప్రజాశాంతి పార్టీ కి రాలేదు. అంత ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కేఏ పాల్ అమెరికా వెళ్ళి పోవడం జరిగింది. ఇటువంటి సమయంలో ఇటీవల కాలంలో కరోనా వచ్చిన టైములో ఇదంతా చైనా కుట్ర అని అమెరికా నుండి కేఏ పాల్ తెగ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ట్రంప్ తో మాట్లాడుతున్నట్లు, కరోనా వైరస్ వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరికి చైనా నుండి డబ్బులు ఇప్పించడానికి రెడీ అవుతున్నట్లు ఇలా అనేక రకాలుగా కబుర్లు చెప్పటం జరిగింది.
అంతేకాకుండా చైనా పై అంతర్జాతీయ కోర్టులో కేసు కూడా ఫైల్ చేయాలని అనుకుంటున్నట్లు కూడా కేఏ పాల్ అప్పట్లో స్పష్టం చేశారు. అయితే దేశంలో ఇన్ని వేల మరణాలు కేసులు నమోదవుతున్నా తరుణంలో దేశ ప్రజలు మరియు నెటిజన్లు కేఏ పాల్ ఏమైపోయావ్?, ఎక్కడ ఉన్నావు ? అని అంటున్నారు. నువ్వు చెబితే ప్రపంచ యుద్ధాలు ఆగిపోతాయి కదా మరి ఈ కరోనా నీ ఎందుకు ఆపలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎక్కడున్నావ్ నువ్వు, ప్రపంచంలో కాదు ఇండియాలో ఉన్న కరోనా నీ తరిమి కొట్టు మన దేశస్థులు చనిపోతున్నారు కేఏ పాల్ అని అంటున్నారు.