మరో చరిత్ర వినేందుకు, అందుకు తగ్గ ఆసక్తితో సిద్ధంగా ఉండేందుకు ఈ సారి ప్రశాంత్ నీల్ పిలుపు ఇస్తున్నారు. కొంచెం త్వరగానే ఆ పిలుపు అందుకోవాలి. కేజీఎఫ్ సిరీస్ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. కొత్త ప్రతిభకు కొత్త తరహా తపనకు న్యూ ఏజ్ లిటరేచర్ అని చెప్పుకోదగ్గ మాటకు ఈ సినిమా మరో నిర్వచనం. ఆ నిర్వచిత ప్రావస్థ ఎన్నటికీ అనిర్వచనీయ అనుభూతికి సంకేతం.
ప్రపంచం మెచ్చుకునే పనులు కొన్నే చేయాలి.. ప్రపంచాన్ని ఆలోచింపజేసే పనులు కొన్నే చేయాలి. ఆ విధంగా సినిమా స్థాయిని పెంచిన పనులు కొందరే చేయాలి. చేశారు కూడా ! ఓ సినిమా కలెక్షన్ల ప్రభంజనంలో కొత్త రికార్డులను రాసింది. రాస్తోంది కూడా ! చరిత్రను సృష్టించే క్రమంలో ఓ సునామీ హెచ్చరిక ను చేసి వెళ్లింది. ఆ విధంగా కేజీఎఫ్ సినిమా కొత్త చరిత్రకు నాంది. కొత్త ఆలోచనలకు నాంది. అంతేనా ! ఇంకా ఎంతో ! రాయదగినంత చెప్పదగినంత వివరిస్తూ పోతే ఆ వర్ణన ఓ పెద్ద పుస్తకం.. వేల పేజీలు నిండిన ఆ పుస్తకంలో మరో చాప్టర్ త్వరలో అదనంగా వచ్చి చేరనుంది. ఇట్స్ ఎ ఎడిషియనల్ వాల్యూ ఫర్ దట్.
కేజీఎఫ్ సునామీని మరు నిమిషం మరువలేం. ఓస్ ఇంతేనా అని కొట్టిపారేయలేం. మనమూ సాధించవచ్చు అని చెప్పేంత బరువు ఈ కథలో ఉంది. మనమూ మోయగలం అన్నంత బరువు ఈ కథలో ఉంది. కథ చెప్పే క్రమంలో మరో కొత్త ఇతిహాస సంప్రదాయం ఉంది. ఆ విధంగా బంగారు గనులను దాటుకుని వచ్చిన ఈ వెలుగు అందరికీ కాదు అందరిదీ ! దిద్దేరు ఎవ్వరో !
మనుషులంతా మామూలోళ్లు.. అనగా సామాన్యులు. మనుషులు ఇదివరకటి కన్నా భిన్నం అంటే.. అసామాన్యులు అని రాయాలి.. తల్లి గర్భం నుంచి చీల్చుకు వచ్చిన నెత్తుడి గడ్డకు శ్వాస అందించింది లోకం.. నెత్తురు అందుకున్న ఆ బిడ్డ ఆ వాగుల్లో కొన్ని మూల కణాల జాడల్లో తనని తాను తెలుసుకునే వస్తాడు. కనుక కేజీఎఫ్ (రెండు భాగాలు) ప్రపంచాన్ని శాసించిన స్థాయికే వెళ్లింది. వెళ్తుంది కూడా ! ప్రశాంత్ నీల్ అను కుర్రాడు ఇక సినిమా ప్రపంచాన్ని మరో కొత్త స్థాయికి తీసుకుని వెళ్లే బాధ్యతను అందుకున్నాడు. ప్యాండమిక్ లో వచ్చిన డైనమిక్ సెంటెన్స్ కొంత ఆలోచనల, కొంత ఉద్విగ్నతల కలబోత.. ఆవిధంగా డైలాగ్ కు గట్స్ ఉన్నాయి. నో డౌట్ ఇన్ ఇట్.. చాప్టర్ ఒన్ కే మంచి డైలాగులు రాశాడు. ఇక రెండో భాగానికి రాసిన మాటలు కొన్ని ఎంతో ఆలోచింపజేశాయి. కొన్ని మాత్రమే అన్నీ కాదు అన్నది గమనించాలి. అన్నది గ్రహించాలి కూడా !
“రక్తంతో రాసిన కథ ఇది
సిరాతో ముందుకు తీసుకువెళ్లలేం
ముందుకెళ్లాంటే మళ్లీ రక్తాన్నే కోరుతోంది”
మామూలుగా కాదు ఈ డైలాగ్ ప్రపంచాన్నే శాసిస్తోంది. మామూలుగా కాదు ఆ సినిమా ఆచార్య నే ఆశ్చర్యపోయేలా చేసింది. మామూలుగా కాదు ఆ సినిమా ట్రిపుల్ ఆర్ ను సైతం డైలమాలో ఉంచింది. డైలాగ్ స్పీక్స్ వెల్.. ఇదీ ఇవాళ్టి ప్రత్యేక కథన రీతి..
మన లోకం పాఠకుల కోసం..