ఏ మాయ చేసావే అంటూ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన సమంత.. తక్కువ సమయంలోనే తమిళంలోనూ రాణించింది. దాదాపు తెలుగు, తమిళంలోని అగ్రహీరోలతో సినిమాలు చేసి అగ్రతారల జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే తెలుగులో తాను మొదట నటించిన సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడ్డ సమంత.. 2017 అక్టోబర్‌లో నాగచైతన్యను వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కూడా తగ్గేదేలే అంటూ.. సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం.. మళ్లీ తన కేరీర్‌పై సమంత దృష్టి సారించింది. అయితే విడాకుల తరువాత మరింత రెచ్చిపోయి.. సమంత అందాల అరబోతకు దిగింది. అంతేకాకుండా సైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో నటించి.. అభిమానులకు షాక్ ఇచ్చింది. డివోర్స్ తర్వాత సామ్ గ్లామర్ హద్దులన్నీ చెరిపివేస్తోందని మాట్లాడుకుంటున్నారు.
రోజురోజుకు అమ్మడు అందాలను దాచుకోవడం మానిసినట్లుంది అని కొందరు కామెంట్స్ చేస్తూంటే.. ఘాటుగానే రిప్లేలు ఇస్తూ ముందుకు పోతుంది. పెళ్లికి ముందు ఆమెపై అభిమానుల్లో ఉన్న క్రేజ్.. విడాకుల తరువాత కూడా కొనసాగించేందుకు ఆమె ఈ విధంగా అభినయిస్తే తప్పేంటని.. సమంతను తప్పుగా ట్రోల్స్ చేస్తున్నారని మరి కొందరు అంటున్నారు. ప్రస్తుతం ‘యశోద’ అనే పాన్ ఇండియా మూవీలో సమంత నటిస్తోంది. దీంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ చిత్రంలో నటిస్తోంది. ‘శాకుంతలం’ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.. ఎందుకంటే ఇది పౌరాణిక చిత్రం. పౌరాణిక పాత్రలో సమంత ఎలా నటించింది అనే ఉత్కంఠ నెలకొంది.