KGF-2 TRAILER : రాఖీ బాయ్‌ని చూస్తే గుస్బామ్స్.. ట్రైల‌ర్ అవుట్

-

క‌న్నడ హీరో య‌శ్ ను పాన్ ఇండియా స్టార్ చేసిన సినిమా కేజీఎఫ్. దీనికి సీక్వ‌ల్ గా వ‌స్తున్న కేజీఎఫ్-2 కోసం అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. కాగ ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర బృందం కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. తెలుగు లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. కేజీఎఫ్-2 ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ లో రాఖీ బాయ్ ని చూస్తే.. ఫ్యాన్స్ కు గుస్బామ్స్ రావ‌డం ఖాయం.

ట్రైల‌ర్ లో య‌శ్ మాస్ తో పాటు క్లాస్ లుక్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. ట్రైల‌ర్ తో కేజీఎఫ్-2 పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. కాగ కేజీఎఫ్-2 ను ఈ వేస‌వి సంద‌ర్భంగా .. ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో య‌శ్ కు జోడీగా శ్రీ‌నిధి శెట్టి న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ తో పాటు ప్ర‌కాశ్ రాజ్, రావు రమేశ్ న‌టిస్తున్నారు.

కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 సినిమా 2018 లో విడుద‌ల అయింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కొట్టింది. ఒక కన్న‌డ సినిమా ప్ర‌పంచ సినిమా రంగాన్ని ఒక్క సారిగా భార‌త్ వైపు మ‌ల్చేలా చేసింది. అలాగే హీరో య‌శ్ ను పాన్ ఇండియా.. పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా చేసింది. ఈ సినిమా సిక్వేల్ కోసం ఫ్యాన్స్ దాదాపుగా నాలుగేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కాగకేజీఎఫ్ ను హోంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తున్నారు. ఈ కేజీఎఫ్-2 కు రూ. 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, త‌మిళంతో పాటు కన్న‌డ‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news