‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ హాస్పిటల్‌’గా ఖమ్మం జిల్లా దవాఖానకు గుర్తింపు

-

ఖమ్మం జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ హాస్పిటల్‌’ గుర్తింపు వచ్చింది. ముర్రుపాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు ‘బేబీ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ హాస్పిటల్‌ ఇనిషియేటివ్‌’ (బీఎఫ్‌హెచ్‌ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్‌ అందజేయనున్నారు. ఖమ్మంతో కలిపి రాష్ట్రంలో ఆరు దవాఖానలకు మాత్రమే బీఎఫ్‌హెచ్‌ గుర్తింపు పొందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాన్సువాడలోని ఎంసీహెచ్‌ మొదటి బీఎఫ్‌హెచ్‌ఐ సర్టిఫికెట్‌ సాధించింది.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయనడానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది. బిడ్డ పుట్టిన అరగంటలోనే మ్రురుపాలు తాగించాలని, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మ్రాతమే తాగించాలని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఐదేండ్లలోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్ర‌భుత్వం తల్లిపాల వినియోగం, శిశు మరణాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version