Kiara Advani : రెడ్​ డ్రెస్​లో కియారా హాట్ లుక్స్

-

కియారా అడ్వానీ.. ఈ బాలీవుడ్ బ్యూటీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్​బస్టర్ హిట్ కొట్టడమే కాదు తన అందంతో తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్​తో కలిసి వినయ విధేయ రామలో సందడి చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా కియారా అందానికి, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక ఈ భామ బాలీవుడ్​లో ప్రస్తుతం చాలా బిజీ హీరోయిన్. ఇటీవలే జుగ్ జుగ్ జీయో, గోవిందా నామ్ తేరా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. ఇక ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్​తో కలిసి సత్య ప్రేమ్ కీ కథా సినిమాలో నటిస్తోంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలోనూ కియారా నటిస్తోంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనా చాలా పాపులర్. తాజాగా కియారా పింక్ విల్లా అవార్డ్స్​కు హాజరైంది. ఈ వేడుకలో రెడ్ కలర్ డ్రెస్సులో రెడ్ కార్పెట్​పై హొయలు పోయింది. రెడ్ డ్రెస్​లో కియారా అందాలు చూడతరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లయినా ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ ఏ మాత్రం తగ్గించడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news