అల్లు అర్జున్ పోస్టర్ పై చిరంజీవి కామెంట్

-

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ నుంచి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7 వ తేదీన ఒక చిన్న టీజర్ లా సినిమా నిర్వాహకులు విడుదల చేశారు. ఆ టీజర్ అప్పుడే వైరల్ అవుతోంది కూడా. ఇందులో ‘పుష్ప ఎక్కడ’ అన్న కాన్సెప్ట్ తో తీసిన టీజర్ అది. చివరికి పుష్ప కనిపించి ఇంక పుష్ప గాడి రూల్ మొదలయింది అనేట్టుగా చెప్పారు.

దర్శకుడు సుకుమార్ ఈ టీజర్ లో బాగా హైప్ చూపించాడు పుష్ప కోసం. ఎటు పోయాడు, ఎక్కడికి పోయాడు, బుల్లెట్స్ తగిలి చనిపోయాడా, ఎక్కడ పుష్ప అన్న విషయాన్ని బాగా హైప్ చేయగలిగాడు. అలాగే పుష్ప అనేవాడు డబ్బు ఎలా సంపాదించాడు అని కాదు, సంపాదించినా డబ్బును ఏమి చేసాడు అనే విషయం కూడా చూపించాడు సుకుమార్. అయితే.. ఈ నేపథ్యంలో ఓ పోస్టర్‌ ను కూడా ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌.

 

ఈ పోస్టర్‌లో.. అమ్మోరు అంటేనే భయానకం.. అలాంటిది అమ్మోరునే అలంకరిస్తే ఎలా ఉంటుంది.. పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. అమ్మోరు వేషధారణలో బన్నీ ఇచ్చిన ఫస్ట్ లుక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమ్మోరులా ముక్కు పుడక.. చీర కట్టి.. మెడలో పూలు, నిమ్మకాయల దండ.. చేతికి గాజులు, అదే చేతిలో తుపాకీ.. మెడలో నగలు దిగేసి.. మోడ్రన్ అమ్మోరు లుక్స్ లో కనిపించాడు బన్నీ. ఇక ఇవాళ బన్నీ పుట్టిన రోజు కావడంతో.. ఈ పోస్టర్ ను మెచ్చుకుంటూనే.. బన్నీకి విషేష్‌ చెప్పాడు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news