నార్సింగి లో కిడ్నాపర్ హల్చల్.. చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం

-

రంగారెడ్డి జిల్లా నార్సింగీ లో ఓ దుండగుడు చిన్నారిని ఎత్తుకెళ్లి ఎందుకు చేసిన ప్రయత్నం స్థానికంగా కలకలం రేపింది. చిన్నారులకు మాయ మాటలు చెప్పి వారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు.ఓ చిన్నారి నోరు మూసి ఎత్తు కెళ్లే ప్రయత్నం చేయడంతో గమనించిన ఓ మహిళ గట్టి గా అరుస్తూ నోరు ఎందుకు మూసావంటూ నిలదీసింది. దీంతో ఆ యువకుడు మహిళను నెట్టి పారిపోయే యత్నం చేశాడు.

ఆ మహిళ అరుపులతో పారిపోతున్న యువకుడిని పట్టుకున్నారు స్థానికులు. అక్కడ నిందితుడిని ఓ చెట్టుకు కట్టేసి చితకబాదారు స్థానికులు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అయితే దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులకు కిడ్నాపర్ వద్ద కత్తి ఉన్నట్లు స్థానికులు తెలిపారు.గట్టిగా అరిస్తే చంపేస్తానంటూ బెదిరించినట్లు పోలీసులకు తెలిపారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news