చివరి బస్తా వరకు కేంద్రమే కొంటుంది : కిషన్‌ రెడ్డి

-

ఈ వర్షా కాల సీజన్‌ లో చివరి బస్తా వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని… కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో తెరాస బెంబేలెత్తి పోతోందని… అందుకే తెరాస “లేని సమస్యలు” సృష్టిస్తోందని ఫైర్‌ అయ్యారు. ధాన్యం సేకరణ అసలు సమస్యే లేదు. ఉప్పుడు బియ్యం తీసుకోమని చాలా ఏళ్ళ కిందే కేంద్రం స్పష్టం చేసిందని ఆగ్రహించారు. రా రైస్ వచ్చే విధంగా రైస్ మిల్లర్ల తో మాట్లాడారా ? రైతులకు ఆ రకమైన విత్తనాలు ఇచ్చారా ? మేము బియ్యం కొనమని ఎక్కడా లేఖ ఇవ్వలేదని మండిపడ్డారు.

“పుత్ర వాత్సల్యం” తో రైతులను కెసిఆర్ బలి చేస్తున్నారని… హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన ఫలితం తో తన కొడుకు కేటీఆర్ సిఎం కాడని కెసిఆర్ భయపడుతున్నారని ఆగ్రహించారు. తెలంగాణ ను “విత్తన భాండాగారం” గా చేస్తామన్న కెసిఆర్ కనీసం ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని… టీ ఆర్ ఎస్ నేతలు స్వయంగా నకిలీ విత్తనాలు మార్కెట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సాయం లేక కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని… తెలంగాణలో పంటల ప్రణాళిక లేదన్నారు. ఓ సారి మక్క వద్దంటారు…ఇంకోసారి సన్న బియ్యం వేసుకోమంటారు…ప్రభుత్వానికి ప్లానింగ్ లేదని ఆగ్రహించారు. అందుకే బియ్యంకు ధాన్యం సేకరణ కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news