75 ఏళ్ల తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు : కిషన్ రెడ్డి

-

సెప్టెంబర్‌ 17 చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈరోజున నిజాం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడామని తెలిపారు. హైదరాబాద్ గడ్డపై తొలిసారిగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. మళ్లీ 75 ఏళ్ల తర్వాత సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ గడ్డపై త్రివర్ణ పతాకం ఎగురుతోందని చెప్పారు.

భాజపా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, కర్ణాటక మంత్రి శ్రీరాములుకు స్వాగతం పలికారు. స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణపతాకం ఎగరవేస్తుంటే… ఆనాడు నిజాం ప్రభువు అడ్డుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ గడ్డపై జాతీయ జెండా ఎగరవేసేందుకు ఎందరో ప్రాణాలు అర్పించారని వెల్లడించారు.

సెప్టెంబర్‌ 17న తెలంగాణలో స్వాంతంత్ర్య వేడుకలను గత ప్రభుత్వాలు జరపలేదని కిషన్ రెడ్డి అన్నారు. 75 ఏళ్ల తర్వాత భాజపా ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా నిజాం పాలిత ప్రాంతాల్లో విముక్తి దినోత్సవం నిర్వహించాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది నామమాత్రంగా వేడుకలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. విమోచన దినోత్సవం పేరిట కాకుండా సమైక్యతదినం పేరిట వేడుకలు నిర్వహిస్తోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version