BREAKING : తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ కు కిషన్‌ రెడ్డి ఫోన్‌..

-

మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలోనే.. ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఫోన్ చేశారు.

రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేశారు సీఈవో. మునుగోడు ఉప ఎన్నికల రౌండ్ల వారి ఫలితాలు వెల్లడించడంలో CEO విఫలమైందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news