కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటేసినట్టే : కిషన్‌ రెడ్డి

-

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగగా మారిందని అన్నారు. రాష్ట్రంలో 75 శాతం కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో కల్తీ విత్తనాల పెరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఓ కుటుంబ పార్టీ అని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటేసినట్టేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అంతేకాక, రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అవుతుందని తెలిపారు. ఈ తొమ్మిదేళ్లలో అన్ని వర్గాల ప్రజలు అవమానానికి గురయ్యారని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, గిరిజనులు, దళితులు, మైనార్టీలు ఇలా చెప్పుకుంటూ అందరూ మోసపోయారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం రాబోతోందని.. అన్ని వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version