సినిమా టికెట్ల వ్యవహారం పై నిన్న టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. సినిమాలు తీసుకునే అమ్ముకుంటే… ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏంటని పేర్ని నాని ప్రశ్నించారు వర్మ. అయితే దీనిపై తాజాగా కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో సినిమాలు తీసుకుంటూ… తమ ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
సినిమా టిక్కెట్ల గురించి ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన మేం ఒక నిర్ణయం తీసుకున్నాం..చంద్రబాబు ఐనా ఆడి చెంచా గాళ్ళు ఐనా ట్విట్టర్ లో మొరగడం తప్ప పీకేది ఏంలేదని చురకలు అంటించారు. దమ్ముంటే సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గకుండా ఆపండని సవాల్ విసిరారు కొడాలి నాని. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టాక్స్ పే చేసేవారికి, ఇక్కడ జీవించే వాళ్ళకి మాత్రమే గవర్నమెంటును అడగడానికి నైతిక విలువ కలిగి ఉంటారని… ఎవరైనా సరే పక్క రాష్ట్రాల్లో బతుకుతూన్నోల్లు ఎటువంటి ప్రశ్నలు వేయడానికి అర్హత లేదని స్పష్టం చేశారు.