బాబుకు కొడాలి కౌంటర్లు..ఆ పని చేసింది జూనియర్ ఎన్టీఆర్..!

-

టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గుడివాడలో ఆయన పర్యటించారు. అర్థరాత్రి వరకు ఆయన రోడ్ షో సాగింది..రోడ్ షోకు జనం నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇక సభలో కొడాలి టార్గెట్ గా బాబు విమర్శలు చేశారు.

ఈ క్రమంలో బాబు విమర్శలకు కొడాలి నాని కౌంటర్లు ఇచ్చారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలని,  గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇపుడు దొంగ ప్రేమ ఒలక పోస్తున్నారని, గుడివాడ నియోజక వర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయితే ఫ్లై ఓవర్లు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాబు టార్గెట్ గా గుడివాడలో పేదల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం అయినా కొన్నారా? అని ప్రశ్నించారు. దేవుడి దయవల్ల 2004, 2009లో తనని గెలిపించాలి అని చంద్రబాబు అనలేదు కాబట్టి తాను  గెలిచానని,  2014లోరావి, 2019లో అవినాష్ ను గెలిపించాలని కోరితే ప్రజలు ఓడించారని, చంద్రబాబు జిత్తుల మారి నక్క అని, ఆయన గుడివాడ కు చేసింది ఏమీ లేదని అన్నారు.

నిమ్మకూరు వెళ్తే చంద్రబాబుకు ఉండటానికి ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదని, అందుకే బస్సులో పడుకున్నారని,  పెళ్ళైన 42 ఏళ్లకు అత్తగారు ఇంటికి వెళ్ళి పడుకున్న చంద్రబాబుకు సిగ్గు ఉందా? అని ఫైర్ అయ్యారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది తాను, జూనియర్ ఎన్టీఆర్ అని, నిమ్మకూరు పై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు మాత్రమే అని, నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవని కొడాలి..బాబుపై ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news