ఈ రోజు మొహాలీలో జరిగిన పంజాబ్ మరియు కోల్కతా ల మధ్య జరిగిన మ్యాచ్ లో అనూహ్య రీతిలో కోల్కతా జట్టు ఓటమి పాలయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కోల్కత్తా ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఏ దశలోనూ కోల్కతా నిలకడగా ఆడలేదు.. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిల్చింది. కానీ రస్సెల్ మెరుపులతో గెలిచేలా కనిపించిన కోల్కతా కు వర్షం రూపంలో మరో శత్రువు ఎదురయ్యాడు.
దానితో మ్యాచ్ 16 ఓవర్ల తర్వాత భారీగా వర్షం రావడంతో కోల్కతాకు షాక్ తగిలింది. అప్పటికి కోల్కతా స్కోర్ 7 వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద ఉంది, కానీ డక్ వర్త్ లూయిస్ పద్దతిలో గెలవడానికి ఇంకా 7 పరుగుల దూరంలో ఉంది. దీనితో పంజాబ్ ను విజేతగా ప్రకటించారు.