కోల్ కతా కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ హవా… ప్రతిపక్షాలకు షాక్.

-

కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతిపక్షాలకు చెప్పుకోదగిన వార్డులను కూడా కైవసం చేసుకోలేకపోయాయి. మొత్తం 144 స్థానాలు ఉన్న కలకత్త మున్సిపల్ కార్పోరేషన్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ 134 స్థానాలను ఏకపక్షంగా గెలుపొందింది. ముఖ్యంగా పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ చతికిలపడింది. కేవలం మూడు స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 2, సీపీఎం 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు మింగుడుపడటం లేదు. గత ఎన్నికల్లో 5 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు మాత్రం కేవలం 3 స్థానాలే గెలిచింది.

దాదాపు 7 నెలల క్రితం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా త్రుణమూల్ కాంగ్రెస్ బంఫర్ విక్టరీ సాధించింది. మూడో సారి మమతాబెనర్జీ బెంగాల్ కు ముఖ్యమంత్రి అయింది. అయితే తాజాగా కోల్ కతా విక్టరీతో మరోసారి త్రుణమూల్ సత్తా చాటింది. బెంగాల్ లో సత్తా చాటాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్న బీజేపీకి మరోసారి కల చెదిరింది.

Read more RELATED
Recommended to you

Latest news