కవిత వచ్చే బతుకమ్మ తీహార్ జైలులోనే చేస్తుంది – కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో మీకు సంబంధం లేదన్నారు కానీ.. మీకు సంబంధం లేకపోతే, మీకు చేతకాకపోతే, మీ తండ్రి, నువ్వు.. సీఎం, మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

కెసిఆర్ కుటుంబ స్వార్థం వల్ల వాళ్లకు సంబంధించిన మనుషులకు మంచి చేయడానికి పేపర్ లీక్ చేశారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే బతుకమ్మని తీహార్ జైలులో చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ జైలు పాలు కావాల్సిందేనని జోష్యం చెప్పారు. కేంద్ర నిఘా వ్యవస్థ కల్పకుంట్ల కుటుంబం అవినీతి మొత్తం బయటపెడుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version