కేసీఆర్ కు దైర్యం వుంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టాలి – కోమటిరెడ్డి

-

సీఎం కేసీఆర్ కు దైర్యం వుంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని స‌వాల్ చేశారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండల చిన్నకపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన విచ్చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గ్రామప్రజలు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కు దైర్యం వుంటే ఇపుడు ఎన్నికలు పెట్టాలి…. బీజేపీ పార్టీ గ్రామస్థాయిలో లేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణ వస్తే డబుల్ బెడ్రూం వస్తదని ఓట్లు వేస్తే మోసం చేసిన ఘనత కేసిఆర్ ది.. ఎన్నికల ముందు గొఱ్ఱెలు , బర్రెలు గుర్తుకు వస్తాయని , గెలిచిన తర్వాత పధకాలను మరిచిపోయె ఘనత కేసీఆర్ దని విమ‌ర్శ‌లు చేశారుర‌. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గ్రామాలు అభివృద్ధి చేయలేదు…రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వశిస్తున్నారన్నారు.

రాష్టాన్ని దివాళా తీసి అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నది… గ్రామ పంచాయితీలలో నిధులు లేక ఇబ్బందులు పడుతుందని మండి ప‌డ్డారు. ఎర్రబెల్లి దయాకరరావు మంత్రి పదవుల్లో ఉండి, ఖాళీ సీసాలు అమ్ముకొని గ్రామ పంచాయితీ నడిపించుకోవలని సిగ్గులేని మాటలు అంటున్నాడు… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తే చెయ్ నరికివేస్తా హెచ్చరికలు జారీ చేశారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version