కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం…ఇక పై నో పాలిటిక్స్‌ !

-

పీసీసీ దక్కకపోవడంతో గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక‌పై ప్రజా స‌మస్యలు తీర్చేందుకు ప్రజ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటానని.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్దని..ఇప్పటి నుంచి రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయ‌బోనని స్పష్టం చేశారు. ఇక నుంచి భువ‌న‌గిరి, న‌ల్గొండ పార్లమెంట్ ప‌రిధిలోని ప్రతి గ్రామంలో ప‌ర్యటించి అక్కడ తిష్ట వేసిన స‌మ‌స్యల‌ను తెలుసుకుని వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు కోమటిరెడ్డి.

గ్రామాల అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌తో పోరాడి నిధులు తీసుకు వ‌చ్చేందుకు ప్రయ‌త్నం చేస్తానని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాల మీదే దృష్టి పెట్టాల‌ని నిర్ణయించుకున్నానని… ప్రతీక్ ఫౌండేష‌న్ ద్వారా వీలైనంత ఎక్కువ‌గా సేవా కార్యక్రమాలు చేప‌డుతానని స్పష్టం చేశారు. న‌ల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవ‌రైనా త‌న తలుపు త‌ట్టవ‌చ్చని వెల్లడించారు. కాగా… పీసీసీ గా రేవంత్‌ రెడ్డిని నియమించడపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మండిపడ్డ సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news