రూ.50 వేల కోట్ల స్కాం.. కేసీఆర్ కుటుంబంపై ప్రధానికి కోమటిరెడ్డి ఫిర్యాదు

-

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ ఎంపీ కోమటిరెడ్డి అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటి అనంతరం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. తెలంగాణ సమస్యలు అడిగి ప్రధాని మోడీ తెలుసుకున్నారని… మూసి నదిలో నీరు శుద్ధి చేయకుండా కింది కి వెళితే నల్గొండ జిల్లా ప్రజలు లక్షలాది మంది ప్రజలుచనిపోతున్నారని చెప్పారు. నమామి గంగ తరహాలో మూసినది ప్రక్షాళన చేయాలని మోడీని కోరానని చెప్పారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే 6 లైన్ నిర్మాణం పై చర్చించా 2022 ఏప్రిల్ లో ప్రారభించాలని… జీఎంఆర్ సంస్థ హైవే నిర్మాణం చేపట్టకుండా ఆర్బిట్రేషన్ కు వెళ్లి మెండిగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 2025లో చేపడతామంతున్నారు.. ఇప్పటికే గడ్కరీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళానని.. ప్రధాని సైతం ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరానని వెల్లడించారు.

తెలంగాణలో పెద్ద మైనింగ్ కుంభకోణం జరగబోతుందని.. సింగరేణికి అలాట్ చేసిన మైన్ తో 50 వేల కోట్ల కుంభకోణం జరగబోతుందని సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి విషయంలో కోల్ ఇండియా గైడ్ లైన్స్ పక్కన పెట్టి కేసీఆర్ కుటుంబ సభ్యులకు మైన్ టెండర్ అప్పగించే ప్రయత్నం జరుగుతుందని.. తప్పకుండా చర్యలు ఉంటాయని ప్రధాని అన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news