వృద్ధాప్య పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

-

వృద్ధాప్య పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెల రోజుల్లోనే కొత్త పింఛన్లు ఇస్తామని.. అర్హత గల వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రకటన చేశారు. సోమవారం శాసనసభలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పద్దు పై మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో పల్లెల ముఖచిత్రం మారిపోయిందని చెప్పారు. గతంలో తెలంగాణలో 8690 గ్రామ పంచా యతీలు ఉండగా వాటిని 12,760 కి పెంచినట్లు తెలిపారు.

3146 తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని స్పష్టం చేశారు ఎర్రబెల్లి దయాకర్‌. బిజెపి రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం చాలా ఎక్కువగ రేట్లు అని తెలిపారు. గ్రామ పంచాయతీలకు అత్యధిక నిధులు ఇచ్చిన ఘనట టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. రూ.67.40 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 13650 ఎకరాల్లో 18472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఎర్రబెల్లి దయాకర్‌.

Read more RELATED
Recommended to you

Latest news