హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీకి గెలిస్తే మీటర్లు వచ్చినయా : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

-

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో.. మునుగోడులో జరగనున్న బీజేపీ సభ ‘మునుగోడు సమరభేరి’తో తెలంగాణలో ధర్మ యుద్ధం మొదలుకాబోతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ధర్మయుద్ధంలో విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. సభ మొదలవడానికి ముందు మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… సభకు ఐదు లక్షల మందికి తక్కువ రారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో కేసీఆర్ మీటింగ్ ఎందుకు పెట్టిండో.. తన ప్రసంగంలో ప్రజలకు చెబుతానని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి. ‘‘ హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీకి ఓటేస్తే.. బావుల కాడ మీటర్లు రాలేదు కదా.. మరి మునుగోడులో మాత్రం బీజేపీకి ఓటేస్తే బావుల కాడ మీటర్లు ఎట్లొస్తయ్ ?’’ అని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి.

komatireddy rajgopal reddy joins bjp RS News | Reading Sexy News

ఈసందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మునుగోడు సభకు ప్రజల స్పందన బాగుందన్నారు. గ్రామ స్థాయిలో బీజేపీ లేదు అనే ప్రచారంలో వాస్తవం లేనే లేదన్నారు వివేక్ వెంకటస్వామి. మునుగోడు సభ తర్వాత.. దక్షిణ తెలంగాణలో బీజేపీ లేదు అనే విషయం ఉండదన్నారు వివేక్ వెంకటస్వామి. గ్రామీణ ప్రజలు, రైతు వర్గాలు బీజేపీ వైపు చూస్తున్నారని వివేక్ తెలిపారు. మునుగోడు సభకు జనం పోటీ పడి వస్తున్నారని వివేక్ వెంకటస్వామి చెప్పారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి హామీలను నెరవేర్చకుండా మొండిచెయ్యి మిగిల్చిన సీఎం కేసీఆర్ కు తగిన శాస్తి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు వివేక్ వెంకటస్వామి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news