వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

-

అంగన్ వాడీలకు రూ. 26 వేలు, ఆశావర్కర్లు రూ.18 వేల కనీస వేతనం, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేసిన అంగన్ వాడీ ,ఆశావర్కర్లకు రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడియన ఆయన.. గత 20 రోజులు గా దీక్ష చేస్తున్న అంగన్వాడీ లకు న్యాయం చేయాలన్నారు. కరోనా సమయంలో సేవలందించిన అంగన్ వాడీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వనిదేన్నారు.

మళ్ళీ రావాలే మా రాజన్న,మునుగోడులో దద్దరిల్లిపోతున్న పాట | Komatireddy  Rajgopal Reddy Song |Kaloji TV - YouTube

అంగన్ వాడీల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి ఆంధ్ర కాంట్రాక్టులకు దోచి పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాందించి.. చిన్న చిన్న ఉద్యోగులను సమ్మె బాట పట్టిస్తుండని ధ్వజమెత్తారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ లు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలు, ఆయాల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధింపులకు పోకుండా వెంటనే వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ రామ్ రెడ్డి, ఎంపీటీసీ వెన్నమనేని శోభ, రవీందర్రావు, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, ఎలిమినేటి సత్తిరెడ్డి, జమ్ముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news