కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది జనసేన కార్యకర్త కాదా..? అని ప్రశ్నించారు హోం మంత్రి తానేటి వనిత. ఆ తరువాత ప్రతిపక్షాలు మాట మార్చాయి అని ఆరోపించారు. టీడీపీ, జనసేన నాయకులు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసింది నిజం కాదా అని అన్నారు. నిరసనకారుల వెనుక కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సందర్భంతో ఈ ఘటనలకు పాల్పడ్డారని ఆమె అన్నారు. ఇప్పటి వరకు 72 మందిని గుర్తించామని…46 మందిని అదుపులోకి తీసుకున్నామని వనిత తెలిపారు. ఈ కుట్రకు బాధ్యులెరో గుర్తిస్తాం అని అన్నారు. కోనసీమ సంఘటనను ఊహించ లేదని ఆమె అన్నారు. పోలీసులు చాాలా సంయమనం పాటించారని.. ఓ వైపు రాళ్ల దాడులు జరుగుతున్నా… పరస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని అన్నారు. గతంలో రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లుగా ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటిపై దాడిని ఖండించకుండా, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.
కోనసీమ సంఘటనను ఊహించలేదు: హోం మంత్రి తానేటి వనిత
-