మీకు చాలా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? మీకో హెచ్చరిక..

-

ఈరోజుల్లో బ్యాంక్ సేవలను బట్టి బ్యాంక్ ను మారుస్తున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే..ఒక వ్యక్తికి రెండు, మూడు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు కొత్త రూల్ అమల్లోకి వచ్చింది..ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లు ఉంటే మాత్రం భారీ షాక్ తగిలినట్లే..ఎక్కువ ఖాతాలుంటే ఆర్థిక నష్టంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.మీరు పన్ను, పెట్టుబడి నిపుణులను సంప్రదిస్తే ఒకే ఖాతాను కలిగి ఉండాలని సూచిస్తారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉండటం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం..

చాలా బ్యాంక్ లలో ఖాతాలు ఉంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..మెయింటనెన్స్‌,డెబిట్ కార్డ్ ఛార్జీ, SMS ఛార్జ్, సర్వీస్ ఛార్జ్, మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జ్ అంటూ వేర్వేరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే బ్యాంకులు భారీ ఫైన్లని రాబడుతాయి.అదే..ఒకే బ్యాంకు ఖాతా ఉంటే రిటర్న్‌లు దాఖలు చేయడం సులభమని పన్ను నిపుణులు అంటున్నారు. వాస్తవానికి మీ ఆదాయాల గురించిన పూర్తి సమాచారం ఒకే ఖాతాలో అందుబాటులో ఉంటుంది. వేర్వేరు బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం వల్ల ఈ గణన కష్టమవుతుంది.

ఈ పరిస్థితిలో పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఒక సంవత్సరం పాటు సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతాలో ఎలాంటి లావాదేవీ జరగకపోతే అది ఇన్‌యాక్టివ్ బ్యాంక్ ఖాతాగా మారుతుంది. రెండేళ్లపాటు లావాదేవీలు జరగకపోతే అది డోర్మాంట్ ఖాతా లేదా ఇన్‌ఆపరేటివ్‌గా మార్చబడుతుంది.ఇలా వేర్వేరు బ్యాంక్‌లు ఉంటే మోసాలు జరిగే ప్రమాదం కూడా ఎక్కువ..అంతేకాదు మినిమమ్ బ్యాలెన్స్ ను తప్పక మెయిన్టైన్ చేయాలి..అందుకు అన్నిటికీ ముఖ్యంగా వాడే బ్యాంక్ ను మాత్రమే ఉంచుకొని మిగిలిన వాటిని క్లోజ్ చెయ్యడం బెస్ట్ అని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news