వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీచార్జ్‌ ధరలు..

టెలికాం దిగ్గజ సంస్థలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలైన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వీఐ (వొడాఫోన్ ఐడియా)లు ప్రీపెయిడ్ వినియోగదారులను బాదేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీపావళి (నవంబరు) నాటికి ప్రీపెయిడ్ చార్జీలను 10 నుంచి 12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Monthly recharge plans from Jio, Airtel and Vodafone Idea

కాగా, గతేడాది నవంబరులోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు ప్రీపెయిడ్ చార్జీలను 20 నుంచి 25 శాతం మేరకు పెంచగా, అదే ఏడాది డిసెంబరులో జియో కూడా పెంచింది. ఇక, తాజా నిర్ణయంతో ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) ఎయిర్‌టెల్ రూ. 200కు, జియో రూ. 185కు, వీఐ రూ. 135 పెంచుకునే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియమ్ ఓ నీల్ అండ్ కో భారత ప్రతినిధి మయూరేశ్ జోషి వెల్లడించారు.