నెలకొక్క లీడర్ ను టిఆర్ఎస్ నుంచి పట్టుకొస్తా – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

నెలకొక్క లీడర్ ను టిఆర్ఎస్ నుంచి పట్టుకొస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బీజేపీలో చేరే విషయం కాంగ్రెస్ నేతలందరికీ తెలుసు అని స్పష్టం చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి.

ఇన్ని రోజులు నేను న్యూట్రల్ గా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని…ఇప్పుడు బీజేపీలో చేరేసరికి అందరూ అడుగుతున్నారన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్ కంటే సీనియర్ నేతలకు కూడా నేను బీజేపీలో చేరుతున్న విషయం తెలుసు అని…కేసీఆర్ ను అడ్డుకోవడం బీజేపీకే సాధ్యం అని పేర్కొన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదు…ఇతర పార్టీలకు టీఆరెస్ ను ఢీకొట్టే సత్తా లేదని వెల్లడించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. నాకు కరెక్ట్ కమిటీ లో అవకాశం ఇచ్చారు(చేరిక ల కమిటీ లో ఉన్న)… నెలకొక్క లీడర్ ను అయినా పట్టుకొస్తానని వెల్లడించారు కొండా విశ్వేశ్వరరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news