బ్రేకింగ్ : తెలంగాణలో కోవిడ్ ఆంక్షలు ఈ నెల 31 వరకు పొడగింపు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా ఆంక్షలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది కెసిఆర్ సర్కార్. కోవిడ్ ఆంక్షలు ఈ నెల 31 వరకు పొడగిస్తు.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజుతో తెలంగాణ లో కరోనా ఆంక్షలు ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు తాజాగా పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.

ఇక ఇది ఇలా ఉండగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో తెలంగాణ   రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించింది. సర్వేలో జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారందరికి మెడికల్ కిట్లు అందించాలని ఆదేశించారు మంత్రి హరీష్ రావు. కరోనా పెరగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలిని అధికారులకు సూచించారు. 27 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని.. 76 హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.340 మెట్రిక్ టన్నుల కు ఆక్సిజన్ సామర్థ్యం కి చేరుకున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news