కృష్ణకు హిట్ సినిమా ఇవ్వని దాసరి నారాయణరావు.. చివరకు !!

-

తెలుగు చిత్ర సీమలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పొచ్చు. పదేళ్ల పాటు మూడు షిఫ్టుల్లో పని చేసి వరుస సినిమాలు చేశారు. ప్రయోగాలకు కేరాఫ్ గా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు కృష్ణ. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరర్ రావుతోనూ సినిమాలు చేసిన కృష్ణ.. ఇండస్ట్రీలోకి తన నట వారసుడిగా మహేశ్ బాబును ఇంట్రడ్యూస్ చేశారు. కాగా, ఆయనకు దర్శకరత్న దాసరి నారాయణరావు హిట్ సినిమా ఇవ్వలేదని ఓ సందర్భంలో చెప్పారు.

దర్శకుడు అనే పేరుకే గౌరవం తెచ్చిన దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ ‘శుభమస్తు’ అనే సినిమా చేశారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. కాగా, దాసరి నారాయణరావు ‘ఒసేయ్ రాములమ్మ’ ఫిల్మ్ లో అతిథి పాత్ర పోషించి కృష్ణ హిట్ అందుకున్నారు.

ఆ విధంగా తనకు హిట్ మూవీని దర్శకరత్న దాసరి నారాయణరావు ఇచ్చారని తెలిపారు కృష్ణ. వృద్ధాప్యం వలన ప్రస్తుతం సినిమాలకు కృష్ణ దూరంగా ఉన్నారు. ఇక ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు ఎస్.ఎస్.రాజమౌళితో మహేశ్ సినిమాలు చేయనున్నారు.

మహేశ్ గత చిత్రం ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ లో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటించింది. బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యపీగా ఫీలయ్యారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version