నీళ్ల వివాదంలోకి కృష్ణాబోర్డు.. టీఆర్ఎస్‌, వైసీపీ ల‌కు కొత్త ట్విస్టు!

-

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల న‌డుమ ఏ స్థాయిలో కృష్ణా నీళ్ల వివాదం జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే. ఈ వివాదాన్ని ఆస‌రాగా చేసుకుని టీఆర్ఎస్‌, వైసీపీ (TRS‌, YCP) పార్టీలు ప్ర‌జ‌ల వ‌ద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే ఇరు పార్టీల మంత్రులు తీవ్ర స్థాయిలో తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు. అయితే జ‌గ‌న్‌, కేసీఆర్ మాత్రం డైరెక్టుగా మాట్లాడ‌ట్లేదు.

టీఆర్ఎస్‌, వైసీపీ (TRS‌, YCP)
టీఆర్ఎస్‌, వైసీపీ (TRS‌, YCP)

ఇప్ప‌టికే ఏపీ క‌డుతున్న ప్రాజెక్టుల‌పై ఫైట్ చేస్తామ‌ని కేసీఆర్ చెప్ప‌డం ఒక ఎత్తు అయితే ఏకంగా విద్యుత్ ఉత్ప‌త్తి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్పత్తి జ‌రిగే ప్రాంతం ద‌గ్గ‌ర భార‌గా పోలీసుల‌ను కూడా మోహ‌రింపజేయ‌డంతో వివాదం మ‌రింత రాజుకున్న‌ట్టు అయింది.

అయితే ఇదే వివాదంలోకి కొత్త‌గా ఇప్పుడు మ‌రో ట్విస్టు ఏర్ప‌డిది. అదేంటంటే ఏపీ ప్ర‌భుత్వం ఈ వివాదంపై కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేయ‌గా.. బీజేపీ పెద్ద‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. కానీ అనూహ్యంగా కృష్ణాబోర్డుమాత్రం ముందుకు వ‌చ్చి ఈ నెల 9న స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఈ స‌మావేశానికి ఇరు రాష్ట్రాల నీటిశాఖ అధికారులు రావాల‌ని ఏపీకి లేఖ రాసింది. దీంతో టీఆర్ఎస్‌, వైసీపీ సెంటిమెంట్ రాజ‌కీయానికి బ్రేక్ ప‌డ్డ‌ట్టు అయింది. మ‌రి ఆ స‌మావేశానికి అధికారులు వెల్తారా లేదా అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news