ఉత్తరాఖండ్‌ కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామి

-

ఉత్తరాఖండ్‌ కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామీ నియామకం అయ్యారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర 11 వ సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామీని బీజేపీ శాసనసభా పక్షం ఇవాళ ఎన్నుకుంది. ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అధ్యక్షతన ఇవాళ బీజేపీ శాసన సభా పక్షం సమావేశమైంది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలందరూ పుష్కర్‌ సింగ్‌ ధామీని సీఎం గా ఎన్నుకున్నారు. పుష్కర్‌ సింగ్‌ ధామీ… ఖటీమా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చివరి ఎన్నికల్లో ఎన్నికయ్యారు.

అయితే.. సీఎం తీరథ్‌ సింగ్‌ రాజీనామా చేయగానే కొందరి పేర్లు సీఎం రేసులో ముందుకు వచ్చాయి. సత్‌పాల్‌ సింగ్‌, ధన్‌సింగ్‌ రావత్‌ పేర్లు ప్రముఖంగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి రేసులో వినిపించాయి. అయితే.. వారందరినీ కాదని.. అనుహ్యంగా అధిష్టానం పుష్కర్‌ సింగ్‌ ధామీని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అధిష్టానం నిర్ణయానికి కూడా ఎమ్మెల్యేలు ఆమోదం తెలపడంతో.. ఈ అంశానికి తెరపడింది.

Read more RELATED
Recommended to you

Latest news