‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా గత శుక్రవారం విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ టీమ్ ప్రేక్షకుల కోసం ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. సినిమా నుంచి ‘హిలేరియస్ బ్లాక్‌బ్లస్టర్ ప్రోమో-1’ పేరుతో ఓ కామెడీ సన్నివేశాన్ని విడుదల చేసింది. యూట్యూబ్ లో ఇప్పుడు ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామెడీ సీన్ లో బ్రహ్మాజీ అదరగొట్టాడు. ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు.
‘మాట చివర హై అంటే హిందీ అయిపోతుందా? హిందీని మడత పెట్టి లుంగీలో చుట్టాం ఇక్కడ’ అని తనకు హిందీపై ఎంత పట్టుందో చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ. సంబంధం కలుపుకొనేందుకు వచ్చిన ఓ ఫ్యామిలీతో హీరో నాగశౌర్య తెలుగు పదాల చివర ‘హై’ను జతచేసి మాట్లాడతాడు. అప్పుడు.. పక్కనే ఉన్న బ్రహ్మాజీ పంచ్ విసురుతారు.
బ్రాహ్మణ కుర్రాడు తాను పనిచేసే ఐటీ కంపెనీ మేనేజరును ప్రేమించటం, ఓ సమస్య కారణంగా ఆ మేనేజరు పెళ్లికి నిరాకరించటం, ఇంట్లో అబద్ధం చెప్పి చిరరకు వివాహం చేసుకోవటం.. తదితర అంశాలతో రూపొందిన సినిమా ఇది.