ఆస్ట్రేలియాలో అరుదైన గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ..ఏమిటంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా 350 చిత్రాలకు పైగా తెరకెక్కించిన సూపర్ స్టార్ కృష్ణ మొత్తం 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1974లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న ఈయన 1976లో కేంద్ర ప్రభుత్వం నటశేఖర్ అనే బిరుదును అందించింది. 1997లో కృష్ణ ఫిలిం ఫేర్ సౌత్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అలాగే 2000లో కృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2008లో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ కూడా లభించింది. అంతేకాదు 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో కూడా కృష్ణను సత్కరించడం జరిగింది.

ఇదిలా ఉండగా సాధారణంగా మన సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి ఎదిగిన స్టార్ హీరోలు లేదా వ్యక్తుల మరణాంతరం వారి ఫోటోలను , పేర్లను స్టాంప్ రూపంలో విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు ఏ హీరో కూడా సాధించని అరుదైన రికార్డు కృష్ణ సాధించడం గమనార్హం . అది కూడా మనదేశంలో కాదు విదేశాలలో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణ పేరుతో పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. ఇంతటి అద్భుతమైన గౌరవాన్ని అందుకోవడంతో ఆయనపై పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

నటుడిగా , దర్శకుడిగా , నిర్మాత గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా పలు సేవలు అందించారు కృష్ణ. ఆ తర్వాత 1972లో జై ఆంధ్ర ఉద్యమానికి కృష్ణ తన బహిరంగ మద్దతు ప్రకటించారు. 1984లో రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయన 1989లో కాంగ్రెస్ తరపున ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.. అంతేకాదు టాలీవుడ్ నుంచి హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి హీరో కూడా కృష్ణ కావడం గమనార్హం ఇక కృష్ణ 80 మందికి పైగా హీరోయిన్లతో నటించారు. వారిలో ముఖ్యంగా విజయనిర్మలతో 48 చిత్రాలు, శ్రీదేవి తో 31 చిత్రాలు , జయప్రద తో 47 చిత్రాలు, రాధాతో 23 సినిమాలు తీసి రికార్డ్ సృష్టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version