పవన్ కళ్యాణ్ దసరా వేషగాడు..అతని కంటే బ్రహ్మానందం బెటర్ – వైసీపీ మహిళా నేత

-

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్లీనరీలో టీడీపీ నేతలు,పవన్ కళ్యామ్ లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జమల పూర్ణమ్మ. పవన్ కళ్యాణ్ దసరా వేషగాడు అని.. పవన్ కు దసరా మామూలు ఎంత వచ్చిందని ఫైర్‌ అయ్యారు. గతంలో చంద్రబాబును ఏం ప్రశ్నించావ్ …ఇప్పుడు ఏం ప్రశ్నిస్తావ్ అని.. మా నాయకుడిని ప్రశ్నించే దమ్ము నీకు లేదని చురకలు అంటించారు.

రెండు చోట్ల ఓడిపోయావ్ …వార్డు మెంబర్ ను కూడా గెలిపించుకోలేకపోయావ్.. నీ వెంట వచ్చే వాళ్లకు ఓట్లు లేవయ్యా…గుర్తుంచుకో అని నిప్పులు చెరిగారు. ఈసారి ఐదు చోట్ల పోటీచేయి … ఓడిపోవడం ఖాయమన్నారు.

పవన్ కంటే బ్రహ్మానందం బెటర్ అని.. జనంలోకి వెళ్తే బ్రహ్మానందానికి కూడా జనం వస్తారని ఎద్దేవా చేశారు. పెళ్లిళ్ల పేరుతో ఎంత మంది ఆడవాళ్లను మోసం చేస్తావ్.. టీడీపీ, జనసేన నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే నాలుకలు తెగకోస్తామని.. ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే అయ్యన్న పాత్రుడు, లోకేష్‌ల తాటతీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు జమల పూర్ణమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news