హైకోర్టు జడ్జిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్.. ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ దూరం?

-

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈనెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో నూతన సీజే ప్రమాణ స్వీకారానికి రావాలని రాజ్ భవన్ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. సీఎం రిప్లై పై సీఎంవో మౌనంగా ఉన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి మరోసారి ముఖ్యమంత్రి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దీంతో రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు గ్యాప్ మరింత పెరగనుంది.కాగా హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఉజ్జల్ భుయాన్ ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసింది. అలాగే ప్రస్తుత సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news