టీఆర్‌ఎస్‌ ప్లీనరీ కోసం కమిటీలు ప్రకటించిన కెటిఆర్ : వారందరికీ కీలక పదవులు !

-

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింట్‌ ప్రెస్‌ డెంట్‌, మంత్రి కేటీఆర్‌ కాసేపటి క్రితమే… ప్లీనరీ కోసం కమిటీలను ప్రకటించారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ సబితా ఇంద్రారెడ్డి, సభా వేదిక ప్రాంగణానికి చైర్మన్ గా బాలమల్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్‌… ప్రతినిధుల వాలంటీర్స్ కమిటీ చైర్మన్ గా శంబిపూర్ రాజును నియమించారు.  ప్రతినిధుల పేర్ల నమోదు కోసం 17 కౌంటర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే… పార్కింగ్ కమిటీ చైర్మన్ గా కెపి వివేకానంద అలాగే… భోజన కమిటీ చైర్మన్ గా మాధవరం కృష్ణారావును నియమించారు కేటీఆర్‌.

ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్ గా మధుసూదన్ చారి మరియు మీడియా కమిటీ బాధ్యతలను భాను ప్రసాద్, కర్నె ప్రభాకర్ లకు అప్పగించారు. నగర అలంకరణ కమిటీ బాధ్యతలను మంత్రులు తలసాని, సబితా, మల్లారెడ్డి, మహ్మద్ అలీ లకు అప్పగించారు.

టిఆర్ఎస్ ఎన్నో రకాల సవాళ్లు అధిగమించిందని… ప్రజలను సమీకరించి తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్‌. స్వీయ ఆస్తిత్వమే శ్రీరామ రక్ష అని ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని…రెండోసారి కూడా టీఆర్‌ఎస్‌కే అధికారం కట్టబెట్టారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో పాలన విజయాలు సాధించామని… నాందేడ్ జిల్లా ప్రజలు తెలంగాణలో కలుస్తామని అక్కడి ప్రభుత్వాన్ని నిలదిస్తున్నారని చెప్పారు.  రాయచూరు ఎమ్మెల్యే కూడా తెలంగాణలో కలుస్తాన్నారని గుర్తు చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news