టీఆర్ఎస్ ఎంపీ డి. శ్రీనివాస్ తో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తి లేపుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ డి. శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. డీఎస్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనను కలిశారు. గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీకి అంటీముట్టనట్లుగా డీఎస్ వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీ వైఖరిపై కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో కొనసాగుతుంటే.. మరో కుమారుడు అరవింద్ బీజేపీ పార్టీ తరుపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. కాగా గత వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.

 పార్టీకి దూరంగా ఉంటున్న, పార్టీకీ రాజీనామా చేసిన సీనియర్ నేతల్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం కూడా డీఎస్ ను కాంగ్రెస్ లోకి మళ్లీ ఆహ్వానించేందుకే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి జిల్లాల వారీగా పలువురు నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకుని మరింత బలపడాలని అనుకుంటుంది.