కేటీఆర్ పై అభిమానం.. అతనేంచేసాడో తెలుసా..!?

-

ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని అభిమానిస్తూ ఉంటారు. కొంతమంది హీరోలను అభిమానిస్తే మరికొంత మంది ప్రజాప్రతినిధులను అభిమానిస్తారు. అయితే తాము అభిమానిస్తున్న వ్యక్తులపై తమకున్న అభిమానాన్ని చాటు కోవడానికి ఎంతో విభిన్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి అలాంటిదే చేశాడు. తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను అమితంగా అభిమానించే అరవింద్ అనే వ్యక్తి… కేటీఆర్ పై తనకున్న అభిమానాన్ని విభిన్న రీతిలో చాటుకున్నాడు.

ప్రవాస తెలంగాణ వాసి అయిన అరవింద్… కేటీఆర్ మాట తీరు ఆయన నాయకత్వ శైలిని ఎంతగానో అభిమానిస్తూ ఉండేవాడు . కేటీఆర్ మీద వున్న అభిమానంతో కేటీఆర్ కు సంబంధించి 108 రేఖా చిత్రాలను రూపొందించారు అరవింద్. ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన అరవింద్… 2 దశాబ్దాల క్రితం ఉపాధి కోసం అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలోనే శాన్ఫ్రాన్సిస్కోలో ఓపెన్ మీడియా గ్రూపు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన కేటీఆర్ రేఖ చిత్రం గీశారు. ఒకటో రెండో కాదు ఏకంగా 108 రేఖాచిత్రాలు గీశారు అరవింద్. ఈనెల 24న కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాలన్ని కేటిఆర్కు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news