ఈ నెల 25 వ తేదీన ప్లీనరీ లో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకుంటామని…కాబట్టి అందరూ నేతలు గులాబీ దుస్తులు ధరించి ప్లీనరికి రావాలని పిలుపు నిచ్చారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు. దశాబ్దాల తెలంగాణ కలను టిఆర్ఎస్ సాకారం చేసిందని… బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలకు కొనసాగించామని పేర్కొన్నారు.
14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తి గా తెలంగాణ తీర్చి దిద్దామని గుర్తు చేశారు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న…. తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉద్యమిచామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
స్వ రాష్ట్రాన్ని సాధించిన తరువాత అద్భుతమైన పరిపాలనతో పరిపాలన సంస్కరణల తో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు పాలనకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం తెలంగాణతో కలిసి పోవాలని డిమాండ్ చేస్తున్నారంటే… తెలంగాణ పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని కొనియాడారు. ప్లీనరీ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుందన్నారు.