హిందీ జాతీయ భాష కాదు.. రుద్దితే ఊరుకోమని కేంద్ర సర్కార్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదని, అధికారిక భాషల్లో హిందీ ఒకటని మంత్రి కేటీఆర్ అన్నారు.
‘ఐఐటీల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేయడం అంటే ఎన్డిఏ ప్రభుత్వం సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసినట్లే. భాషను ఎంచుకునే హక్కు భారతీయులకు ఉంది . హిందీని మాపై రుద్దితే వ్యతిరేకిస్తాం అని ట్వీట్ చేశారు.
ఇక అటు మంత్రి కేటీఆర్… బీజేపీకి బహిరంగ సవాల్ విసిరారు. మునుగోడు ఉపఎన్నిక ఒక కాంట్రాక్టర్ అహంకారం, బలుపు వల్ల వచ్చిందని ఆగ్రహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తున్నా మా మంత్రి జగదీశ్ రెడ్డి ఛాలెంజ్ కు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మునుగోడు కు కేంద్రం 18వేల కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నిక నుండి తప్పుకుంటామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
India does NOT have a National language & Hindi is one among the many official languages
To impose Hindi by way of mandating in IITs & central Govt recruitments, NDA Govt is flouting the federal spirit
Indians should have a choice of language & we say No to #HindiImposition pic.twitter.com/IwXDPNSoSO
— KTR (@KTRTRS) October 12, 2022