Breaking : సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కుప్పకూల్చడమే : కేటీఆర్‌

-

సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటన పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని
ప్రైవేటీకరించమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కల్లబొల్లి మాటలు చెప్పారని ఆయన విమర్శించారు. నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు లోక్ సభలో కేంద్రం ప్రకటించిందని, సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కుప్పకూల్చడమే అని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా.. ‘తెలంగాణ అభివృద్ధిపై అసూయతోనే , ఇక్కడి విజయ ప్రస్థానాన్ని దెబ్బ కొట్టాలన్న కుట్రతోనే సింగరేణి ని ప్రైవేటీకరిస్తున్న కేంద్రం. తెలంగాణతోపాటు దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణిదే కీలక పాత్ర. గనులు కేటాయించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను దివాలా తీయించిన విధంగానే సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తుంది. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్ లోను రికార్డు సృష్టిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరమేమున్నది.

Minister KTR : బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశమెందుకు క్షమాపణ చెప్పాలి - NTV  Telugu

సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. ప్రధానమంత్రి తన సొంత రాష్ట్రం గుజరాత్ కి మాత్రం గనులు కేటాయించుకున్నారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి కేటాయించిన గనుల తాలూకు పత్రాలను విడుదల చేసిన కేటీఆర్. సొంత రాష్ట్రం గుజరాత్ కి ఒక నీతి తెలంగాణకి మరొక నీతిని అమలుచేస్తున్నారా? ప్రధానమంత్రి స్పష్టం చేయాలి. తెలంగాణ పట్ల పక్షపాతం ఇంకెన్ని రోజులు అంటూ ప్రశ్నించిన కేటీఆర్. ఇది ఒక్క సింగరేణి కార్మికుల సమస్య కాదు సమస్త తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి సింగరేణి. సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ప్రజా ఉద్యమం తప్పదు. కేంద్ర ప్రభుత్వ సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై పార్టీలకతీతంగా రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలి.’ అని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news