ఐటీ మంత్రి కేటీఆర్, టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తన పీఏ తిరుపతి పాత్ర ఉందంటూ వచ్చిన వార్తల పై స్పందించారు. నా పీఏ వెంట పడుతున్నారేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసారు ఆయన. జగిత్యాల జిల్లా మొత్తంలో కేవలం ఒక్కరే క్వాలిఫై అయ్యారని అన్నారు. తన పీఏ తిరుపతి స్వగ్రామం పోతారంలో పరీక్ష రాసింది ముగ్గురైతే అందులో ఒక్కఋ కూడా క్వాలిఫై కాలేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మల్యాలలో మొత్తం 415 మంది పరీక్ష రాయగా అందులో 35 మంది అర్హత సాధించారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది పరీక్షలు రాస్తే ఒక్కరికి కూడా 100 మార్కులు దాటలేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. మరి నేను లీక్ చేసింది ఎక్కడ? అని కేటీఆర్ అడిగారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా? అంటూ బండి సంజయ్, రేవంత్ రెడ్డి లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. రేవంత్, బండి సంజయ్ తమ జీవితంలో ఎప్పుడైనా పరీక్షలు రాశారా అని హేళన చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో దొరికిపోయింది ఎవరు, నిజామాబాద్ ఎంపీ కాదా? అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు చెప్పాను, రేవంత్ రెడ్డీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.