ఏ సన్నాసి వల్ల పెట్రోల్ ధరలు పెరిగాయో వారే తగ్గించాలి..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఓ మీడియా చానెల్ తో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు.2014 సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 105 డాలర్లు ఉందని, ఇప్పుడు కూడా అదే రేటు ఉందని చెప్పారు.అయితే పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ. 70 నుంచి రూ. 120కి పెంచారన్నారు. “ఏ సన్నాసీ నిర్వాకం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా వారే ధరలు తగ్గించాలి” అని సూచించారు.తెలంగాణ బిజెపి నేతలకు జైశ్రీరామ్ అనే అర్హత లేదన్నారు.భద్రాచలం దేవాలయాల అభివృద్ధికి వారు ఎన్ని నిధులు కేంద్రం నుంచి తీసుకు వచ్చారో చెప్పాలన్నారు.

దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మోడీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.మోడీ గాంధీలా సూక్తులు వల్లిస్తుంటారు అని ఆయన చేతులు గాడ్సే లా ఉంటాయని చెప్పారు.ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను జైలులో పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు.ప్రతిపక్షాలపై కేంద్రం తన ఆధీనం లోకి సీబీఐ, ఈడీ అధికారులతో దాడులు చేస్తుందన్నారు.తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.కర్ణాటకలో సంక్షేమం ,అభివృద్ధి లేదని బీజేపీ పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో మత విద్వేషాలు వెలుగుచూస్తున్నాయి అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news