తెలంగాణా బీజేపీ అధ్యక్ష్యుడు బండి సంజయ్ మీద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుంది అలాగే త్వరలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల మీద కేటీఆర్ స్పందించారు. ఒక టాప్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు స్పందించారు.
పిచ్చోళ్ళ మాటలకు సమాధానం చెప్పలేం అన్న కేటీఆర్ గతంలో ఒక హిందీ కార్టూన్ వచ్చేదని బండి సంజయ్ ని చూసినా అదే గుర్తుకు వస్తోందని అన్నారు. ఆయన మాట్లాడే మాటలకు మీద ఆయనకి క్లారిటీ లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అసలు మొన్నటి దాకా ఒక్క సీటు కూడా లేని ఆ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరుతుందనే సామెత సరిగ్గా సరిపోతుందని ఆయన అన్నారు.