‘లాల్ సింగ్ చడ్డా’ తెలుగు ట్రైలర్ విడుదల

-

బాలీవుడ్‌ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీల్లో బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌ నటించిన లాల్‌ సింగ్‌ చడ్డా ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్‌తో పాటు కరీనా కపూర్, నాగచైతన్య ఈ చిత్రంలో నటించారు. అయితే.. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం సోషల్ మీడియాలో స్పందించారు చిరంజీవి. లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్ ను విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు చిరంజీవి. ఈ మేరకు చిరంజీవి ట్రైలర్ యూట్యూబ్ లింకును కూడా పంచుకున్నారు.

Aamir Khan's 'Laal Singh Chaddha' trailer to come out on this day - Telugu  News - IndiaGlitz.com

అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని ఆమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే (వయాకామ్ 18 స్టూడియోస్) నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వయాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news