లక్షల కోళ్ళు మృతి, అసలు ఏం జరుగుతుంది…?

-

ఒక పక్క కరోనా వైరస్ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే కోళ్ళను వింత వైరస్ మరింత ఇబ్బంది పెడుతుంది. లక్షల కోళ్ళు కొత్తగా సోకిన వైరస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ వైరస్ ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి, సత్తుపల్లి, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. సరిహద్దు కావడంతో వేల కోళ్ళు ప్రాణాలు కోల్పోతున్నాయి.

ఖమ్మం సహా పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందలాది పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటిల్లో లక్షల కోళ్ళను పెంచుతున్నారు. తాజాగా పెనుబల్లి మండలంలో ఆరు ఫారాల్లో 30 వేలకు పైగా కోళ్ళు చచ్చిపోయాయి. తాము లక్షలు అప్పుచేసి పెట్టుబడి పెట్టి… కోళ్లను పెంచుతుంటే ఈ విధంగా వైరస్ సోకి చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి మండలంలో పది గ్రామాల్లో కోళ్ళు చనిపోతున్నాయి.

అశ్వారావుపేట, జంగారెడ్డి గూడెం, చింతలపూడి ప్రాంతాల్లో కోళ్ళు ఎక్కువగా మరణిస్తున్నాయి. ఇప్పటికే ధర తగ్గి ఇబ్బంది పడుతున్న రైతులు, ఈ పరిణామం తో మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పశు వైద్య శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇంతకీ ఆ కోళ్లను వేధిస్తున్న వైరస్ ఏంటనేది మాత్రం తెలియట్లేదు. చైనాలో ఇలాగే కోళ్లు చనిపోతున్నాయనీ, అలాగే ఇక్కడ కూడా జరుగుతోందా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news