ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2023 చివరి నాటికి ఏపీలో చేపట్టిన భూ సర్వే పూర్తి అవుతుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రెండో విడద కార్యక్రమాన్ని నరసన్నపేటలో సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ‘రెండేళ్ల క్రితం గొప్ప కార్యక్రమం ప్రారంభించాం. 2వేల గ్రామాల్లో భూరికార్డులు ప్రక్షాళన చేసాం. 7.92 లక్షల మందికి భూహక్కు పత్రాలు ఇస్తున్నాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో, మే 2023 కల్లా 6 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు ఇస్తాం. 2023 చివరి నాటికి రాష్ట్రమంతా సర్వే పూర్తవుతుంది’ అని వెల్లడించారు సీఎం జగన్.