FLASH : లతా మంగేష్కర్ భవనానికి సీల్..!

-

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే దీని తీవ్రత అధికంగా మహారాష్ట్ర రాష్ట్రంపై ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో వృద్ధులు అధికంగా ఉన్న ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ భవనానికి సీల్ వేయాలని బీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్ స్వయంగా ఓ ప్రకటనలో తెలిపారు. వయసు మళ్లిన వారు ‘ప్రభుకుంజ్’ బిల్డింగ్ లో ఎక్కువగా ఉన్నందున, వారి భద్రత క్షేమం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు.

కాగా, మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 16,867 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, మొత్తం 328 మంది మరణించారు. 11,541 మంది కారోను నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 7,64,281కి చేరింది. మొత్తం 24,103 మంది మరణించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 5,54,711 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,85,131 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news