కుటుంబ సభ్యులతో నేడు డిపోల ఎదుట మౌన నిరసన దీక్ష..

-

తెలంగాణ గడ్డ మీద ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రకటించేంత వరకూ సమ్మె తప్పదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని ఆర్టీసీ డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ కార్మికులు మౌన నిరసన దీక్షలు చేయనున్నారు. రోజు రోజుకూ ఆర్టీసీ సమ్మెపై ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది.

 

ఇప్పటికే ఆర్టీసీకి ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అలాగే ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ దిగి రాకపోతే ఆయన గద్దె దిగే వరకు పోరాటం కొనసాగిద్దామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు అధిక చార్జీల మోతతో అల్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news